స్పీకర్‌పైకి BRS ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు: కాంగ్రెస్ MLAలు

81చూసినవారు
స్పీకర్‌పైకి BRS ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు: కాంగ్రెస్ MLAలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే గందరగోళంగా మారాయి. ఫార్ములా-ఈ రేసింగ్‌పై KTRపై కేసుపై అసెంబ్లీలో చర్చించాలని BRS ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRS ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై కౌంటర్లు వేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, BRS సభ్యులు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లను విసిరేసుకున్నారు. అయితే స్పీకర్‌పైకి BRS సభ్యులు పేపర్లు విసిరారని.. స్పీకర్ ను BRS ఎమ్మెల్యేలు అవమానించారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. దీంతో స్పీకర్ 15 నిముషాలు సమావేశాలను వాయిదా వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్