తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "రాజ్యాంగం, గవర్నర్, స్పీకర్, సభ పట్ల గౌరవం లేని వ్యక్తులను కేసీఆర్ మంత్రులుగా చేసి ప్రభుత్వాన్ని నడిపించారు. ఇలాంటి వాళ్ల వల్లే బీఆర్ఎస్ పతనమైంది, కానీ వారికి ఇంకా అర్థం కావడం లేదు. ఇది రాజకీయ సంస్కృతి కాదు" అని ఆయన విమర్శించారు.