TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ దృష్టికి మంత్రి శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. అనంతరం సీఎం ఛాంబర్‌లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీశ్ రెడ్డి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. గతంలో స్పీకర్ చైర్‌లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.