ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే..

62చూసినవారు
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే..
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరపున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారని స్పీకర్‌ ఆక్షేపించారు. తన మాటలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.

సంబంధిత పోస్ట్