కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!

74చూసినవారు
కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!
వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలో సారయ్యతో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి చర్చించినట్లు సమాచారం. సారయ్య ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్