కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం హర్యానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. రాహుల్ గాంధీ కాన్వాయ్ పక్కనే ఒక వ్యక్తి మోటార్‌సైకిల్ నడుపుతూ వెళుతున్నాడు. అయితే ఆయన చేతిలో పొడవాటి కర్ర ఉంది. కాన్వాయ్ ముందు వెళుతున్న వాహనంలో ఉన్న పార్టీ శ్రేణులు దీనిని వీడియో తీశారు. ఇది కచ్చితంగా భద్రతా లోపం అంటూ మండిపడుతున్నారు.