MP ఎన్నికల్లో BRS ఘోర పరాభవం

16007చూసినవారు
MP ఎన్నికల్లో BRS ఘోర పరాభవం
తెలంగాణ పార్లమెంట్ -2024 ఎన్నికల్లో BRS చిత్తు చిత్తుగా ఓటమి పాలైంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత 10 ఏళ్ళు కేసీఆర్ సీఎంగా పరిపాలన చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా.. నేటి MP ఎన్నికల ఫలితాలలో ఒక్క స్థానంలో కూడా గెలవక పోవడం BRS శ్రేణుల్ని తీవ్ర నిరాశలో పడేసింది. అయితే కేసీఆర్ 10 ఏళ్ళ సుదీర్ఘ పాలనలో అనేక సంక్షేమ పథకాలు, యాదాద్రి, సెక్రటేరియట్.. ఇంకా అనేక అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం గమనార్హం.

సంబంధిత పోస్ట్