ఓటర్లకు బంపర్ ఆఫర్.. 20 శాతం డిస్కౌంట్

84చూసినవారు
ఓటర్లకు బంపర్ ఆఫర్.. 20 శాతం డిస్కౌంట్
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు నోయిడాలోని హోటళ్లు, హాస్పిటళ్లు పోటీపడుతున్నాయి. ఓటర్లకు డిస్కౌంట్లు, ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. నోయిడాలోని గౌతమ్ బుద్ధనగర్‌లో ఇవాళ పోలింగ్ జరగనుంది. ఓటు వేసి.. ఇంకు చుక్క ఉన్న వేలు చూపిస్తే చాలు.. వారికి ‘డెమోక్రసీ డిస్కౌంట్’ పేరుతో బిల్లుపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. 2 రోజులపాటు ఈ డిస్కౌంట్‌ను కొనసాగించనున్నాయి.

సంబంధిత పోస్ట్