కర్ణాటకలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మడకశిర సరిహద్దులో పావగడలోని హరి హర పుర గ్రామంలో సిలిండర్ పేలి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గుడిసె మొత్తం కాలిపోవడంతో సామగ్రి, నిత్యావసరాలు, సరిఫికెట్లు, దుస్తులు బూడిదయ్యాయని, రూ. 50వేల నగదు అగ్గి పాలైందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.