AP: వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నేడు నిమ్మల పర్యటించారు. మూడు గ్రామాల్లో రూ.3 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పెంచిన విద్యుత్ ఛార్జీలపై తానే ధర్నా చేస్తున్న వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అని సెటైర్లు విసిరారు.