సోషల్ మీడియాలో మరో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఇంటి పైకప్పుపై నిలబడి విద్యుత్ తీగలపై బట్టలు ఆరబెడుతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఇది చూసి ఆశ్యర్చపోయాడు. షాక్ తగులుతుంది కదా.. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. దీనికి అతడు.. కరెంట్ లేదు కదా, షాక్ కొట్టదులే అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.