పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్

83చూసినవారు
పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
AP: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మచిలీపట్నం కోర్టులో నేడు వాదనలు ముగిశాయి. రేషన్ బియ్యం మాయం కేసులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లంకే వెంకటేశ్వరరావు వ్యవహరించారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 30కు వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్