ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో చూస్తే మాత్రం ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయా అని ముక్కున వేలేసుకుంటాం. ఒక యువకుడు శ్మశాన వాటికలో ఉన్న ఓ చితి మీద రొట్టెలు కాల్చుకుంటూ కనిపించాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.