గుజరాత్ జామ్‌నగర్ సమీపంలో డిసెంబర్ 29న ఘోర ప్రమాదం జరిగింది. జామ్‌నగర్-రాజ్‌కోట్ హైవేపై లగ్జరీ బస్సు వేగంగా దూసుకొచ్చింది. అదుపుతప్పి ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెత్వి అనే 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. కుటుంబ సభ్యులంతా స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.