ఐక్యరాజ్యసమితిలో అత్యంత కీలకమైన భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్థాన్‌కు అవకాశం లభించింది. బుధవారం నుంచి 2026 డిసెంబరు వరకు దాదాపు రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్యదేశంగా పాక్ కొనసాగనుంది. సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఇప్పటివరకు జపాన్ ఉన్న స్థానంలో పాకిస్థాన్‌కు చోటు దక్కింది. భద్రతా మండలిలో కొత్తగా అవకాశాన్ని దక్కించుకున్న ఇతర దేశాల జాబితాలో డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా కూడా ఉన్నాయి.