TG: సికింద్రాబాద్ లాలాపేట్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో విద్యార్థులకు అందుతున్న ఆహారం గురించి.. విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బాగా చదువుకోవాలని సూచించారు.