ఆసీస్, భారత్ మధ్య జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అంతేకాకుండా BGT సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో అంతగా రాణించని రిషభ్‌పంత్‌ను తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. పంత్ స్థానంలో మరో వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్ తీసుకోవాలని మేనేజ్ మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.