ఏపీ సర్కార్ సోషల్ మీడియాను మంచికి వాడుదామంటూ ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారానికి యంగ్ హీరో తేజా సజ్జ మద్దతిచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని ప్రజలను, అభిమానులను ఉద్దేశించి ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. 'ఏం కాదులే అని సోషల్ మీడియాలో ఆడపిల్లల ఫొటోలు, వీడియోల కింద బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ఈ కామెంట్స్ వారి మైండ్‌సెట్ ను, వారి కుటుంబాలను డిస్టర్బ్ చేస్తాయి. వీటిని మానుకుందాం' అని చెప్పుకొచ్చారు.