మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ నగరంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. చంద్రశేఖర్ ఔంధ్కర్ (67) అనే వ్యక్తి ప్రముఖ శిశువైద్యుడు. ఆయన స్కూటర్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన ఆయనను కృష్ణా ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన చనిపోయారు. అయితే ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.