బ్రెజిల్‌లోని మినాస్ గెరాయిస్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 22 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.