తమ గ్రామాలకు సకాలంలో బస్సులు రావడం లేదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చౌరస్తా వద్ద కాలేజీ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ ఎండీకి తమ సమస్య గురించి ఎన్నో సార్లు చెప్పామని.. ఇప్పటికైనా స్పందించి తమ సమస్య పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు విద్యార్థులను బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు.