TG: ఆజంపుర ఆశ కార్యకర్తగా పనిచేస్తున్న మలక్‌పేట్‌కు చెందిన సోము అమూల్య (29), శాస్త్రిపురానికి చెందిన షేక్ ఇస్మాయిల్.. డబ్బు సంపాదనకు చిన్నారుల్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. 2022లో ఇస్మాయిల్ ఓ మగ పిల్లాడిని తీసుకురాగా.. వారు ఓ మహిళకు రూ.30 వేలకు విక్రయించారు. పిల్లల విక్రయాల్లో ఆరితేరిన కోల కృష్ణవేణి, దీప్తితో అమూల్యకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఈ ముగ్గురూ శిశువుల విక్రయాల దందా మొదలుపెట్టారు.