AP: కొయ్యలగూడెం పట్టణంలోని తాడేపల్లిగూడెం రోడ్డులో ఓ మాంసం కొట్టు వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా ఒక కిలో మేక మాంసం రూ. 800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు. దీంతో స్థానికులు ముందే పడిగాపులు కాస్తునట్లు సమాచారం.