FSSAI లైసెన్స్ పొందిన షాపులలో మాత్రమే షవర్మా కొనండి: ఆరోగ్యశాఖ

85చూసినవారు
FSSAI లైసెన్స్ పొందిన షాపులలో మాత్రమే షవర్మా కొనండి: ఆరోగ్యశాఖ
FSSAI లైసెన్స్ పొందిన షాపుల నుండి మాత్రమే షవర్మాను కొనుగోలు చేయాలని కర్ణాటక ఆరోగ్యశాఖ వినియోగదారులను తెలిపింది. అన్ని షాపుల వారూ ప్రతిరోజూ తాజా మాంసంతోనే షవర్మాను తయారు చేయాలి, FSSAI చట్టం క్రింద నమోదు చేసుకోవాలి, లైసెన్స్ పొందాలి. ఈ మార్గదర్శకాలను పాటించని తినుబండారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవిధమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్