తమిళనాడు మహాబలిపురంలోని తిరువిడందై బీచ్‌లో ప్రస్తుతం జరుగుతున్న మూడవ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో థాయ్‌లాండ్, జర్మనీ, వియత్నాం, ఫ్రాన్స్, మలేషియా మరియు ఇతర దేశాల నుండి వచ్చిన పతంగులతో ఆకాశం నిండిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు ఈ గాలిపటాల పండుగలో పాల్గొంటున్నాయి. 250 పతంగులు, 45 మందికి పైగా పతంగుల నిపుణులు ఈ ఎడిషన్‌లో పాల్గొంటున్నట్లు తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి కె రామచంద్రన్ తెలిపారు.