'భగత్ సింగ్' ఈ పేరు వినగానే బ్రిటిష్ వలస పాలనపై తిరుగుబాటు చేసిన పౌరుషం గుర్తుకొస్తుంది. చావును ధిక్కరించి దేశం కోసం, ఉరికొయ్యకు వేలాడిన వీరుడి ప్రాణత్యాగం మదిలో మెదులుతుంది. ఆయన దేశభక్తికి అసలు సిసలైన ప్రతిరూపంగా కనిపిస్తాడు. త్యాగం, ధైర్యసాహసాలకు పోరాట సంకేతంగా నిలుస్తాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎత్తుకొని జాతీయోద్యమాన్ని ఉర్రూతలూగించిన వీరుడు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన ధీరుడు భగత్ సింగ్.