ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 14 పర్వతాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా నేపాల్‌కు చెందిన నిమా రింజీ షెర్పా(18) రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 9న టిబెట్‌లోని మౌంట్ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ ఘనత సాధించాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. నిమా రింజీ అధిరోహించిన ఈ పర్వతాలు 8,000 మీటర్లకుపైగా ఎత్తైనవి కావడం మరో విశేషం.