ఢిల్లీ రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్

79చూసినవారు
ఢిల్లీ రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి రావాలని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఫోన్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో నిన్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాగా ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్ఠానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు వచ్చింది.

సంబంధిత పోస్ట్