230 మంది ఎంపీలను సస్పెండ్ చేయగలరా: కాంగ్రెస్

79చూసినవారు
230 మంది ఎంపీలను సస్పెండ్ చేయగలరా: కాంగ్రెస్
ప్రధానిగా మోడీ అధికారంలో ఉన్నంత కాలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల బీజేపీ విధానం మారదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మంగళవారం మాట్లాడారు. గతంలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలను బీజేపీ సస్పెండ్ చేసిందని, ప్రస్తుతం ఉన్న 236 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయగలరా అని ప్రశ్నించారు. NDA సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందనే నమ్మకం లేదన్నారు.

ట్యాగ్స్ :