డయాబెటిస్ ఉన్నవారు మితంగా ఖర్జూరం తింటేనే మంచిది. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్లు ఎ, కె, బి-కాంప్లెక్స్ విటమిన్‌లు సమృద్దిగా ఉంటాయి. ఖర్జూరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 43- 55 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉండదు.