తిరుమల కొండపై ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. గోగర్భం డ్యాం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. నరేంద్ర అనే వ్యక్తి సిగరెట్ త్రాగే అలవాటు ఉంది. తిరుమలలో రెండు రోజులుగా సిగరెట్ త్రాగేందుకు వీలు లేక పోవడంతో గోగర్బం డ్యాం వద్దకు వెళ్లి, డ్యాంలోకి దూకి చేసుకునేందుకు ప్రయత్నించాడు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నరేంద్రకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.