TG: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో కారు బీభత్సం సృష్టించిన ఘటనలో చిన్నారి అంక్షిత మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పైకి కారు దూసుకెళ్లగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం తర్వాత కారు ఆగకుండా వెళ్ళిపోయింది.