ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న నలుగురిని, బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు పాదచారులను ఢీకొట్టింది. రాయ్‌బరేలీ-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 67 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. మృతుడు నజీర్ మౌలానాగా గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించింది.