తెలుగు నటుడు వెన్నెల కిషోర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. దూకుడు మూవీతో తన కలలు తీరిపోయాయని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ మంచి అవకాశాలను ఇచ్చిందని అన్నారు.