ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం జరిగింది. రోడ్డుపై ఆడుకుంటున్న ఓ చిన్నారిన కారు తొక్కుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, చిన్నారిని తొక్కుకుంటూ వెళ్లిన కారు ఓ బీజేపీ నాయకుడి కొడుకుకు చెందినదిగా తెలిసింది. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.