అదుపుతప్పి కాలువలో పడ్డ కారు (వీడియో)

5582చూసినవారు
అతివేగం కారణంగా నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని దక్షిణకన్నడ జిల్లా పుత్తూరు తాలూకా కన్యూర్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి కాలువలో పడింది. ప్రసాద్ పంగన్నయ్య అనే జ్యోతిష్కుడు మారుతీ బ్రిజ్జా కారులో వెళ్తుండగా అది అదుపుతప్పింది. అడ్డుగోడ లేకపోవడంతో నేరుగా వెళ్లి ఆ కారు కాలువలో పడింది. అదృష్టవశాత్తూ బాధితుడు గాయాలతో తప్పించుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్