NIA అధికారులపై పశ్చిమబెంగాల్‌లో కేసు

71చూసినవారు
NIA అధికారులపై పశ్చిమబెంగాల్‌లో కేసు
పశ్చిమ బెంగాల్‌లో NIA అధికారులపై కేసు నమోదు అయింది. తూర్పు మిడ్నాపూర్‌లోని భూపతినగర్ ప్రాంతంలో 2022 బాంబు దాడిపై విచారణ కోసం NIA అధికారులు వెళ్లారు. TMC నేతలు బాలైచరణ్ మైతీ, మోనోబ్రత జానాల విచారణ కోసం వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. మహిళలు NIA అధికారుల కారును చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో తమను వేధించారని మహిళలు ఫిర్యాదు చేయడంతో NIA అధికారులపై పోలీసులు FIR నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్