BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదుపై ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చకు భయపడిన సీఎం.. తప్పుడు కేసులు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటం, ఉద్యమం నుంచి వచ్చినవాళ్లమని అన్నారు.