మలయాళ చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు!

82చూసినవారు
మలయాళ చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు!
మలయాళ సినీ ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. సినిమా పనులు మొదలుకాక ముందే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక మంది బాధితులు ఆరోపించినట్లు తాజా నివేదిక పేర్కొంది. సినిమాలో నటించాలన్నా.. లేదా మరే పని చేయాలన్నా లైంగికంగా సన్నిహితంగా మెలిగితేనే అవకాశాలు ఇస్తున్నట్లు తాము గుర్తించామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్