టెస్ట్ క్రికెట్‌కు టీమీండియా సారథి రోహిత్ శర్మ వీడ్కొలు పలుకనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పేలవమైన షాట్ ఆడి ఔట్ అయిన రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తికి గురై తన గ్లౌజ్‌లను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.