వాహనాల రిజిస్ట్రేషన్‌.. TGకి కేంద్రం ఆమోదం

53చూసినవారు
వాహనాల రిజిస్ట్రేషన్‌.. TGకి కేంద్రం ఆమోదం
తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై టీఎస్‌ నుంచి టీజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టీజీగా మార్చాలని ఇటీవల జరిగిన మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు. దీనికి తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు ‘TG’తో ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్