ఒక ప్రధానమంత్రి ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్‌ను మూడు సార్లు ప్రవేశపెట్టారు. 1958లో పండిట్ జవహర్‌లాల్ లాల్ నెహ్రూ, ఆ తర్వాత 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు, ఆ తర్వాత 1987లో రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020లో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల నిడివితో రికార్డు సృష్టించారు. ఆమె భారతదేశపు మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి కూడా.