కేంద్రంలో BJP ప్రభుత్వం వక్ఫ్ బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొస్తుందని AIMIM పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆర్టికల్ 23, 26లను అడ్డు పెట్టుకొని వక్ఫ్ భూములు దోచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ముస్లింలకు అన్యాయం చేసేందుకు BJP అనుబంధ పార్టీల నాయకులు చంద్రబాబు, నితీష్ కుమార్, జయంత్ చౌదరి తదితరుల మద్దతుతో వక్ఫ్ బిల్లును రూపొందించిందని చెప్పారు. ఆక్రమించిన వారికి వక్ఫ్ భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.