బాదం నూనె తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బాదం నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బాదం నూనె రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదం నూనె మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.