ఆలయాలకు వెళ్లే భక్తులకు రక్షణ కల్పించాలి: పవన్‌

71చూసినవారు
ఆలయాలకు వెళ్లే భక్తులకు రక్షణ కల్పించాలి: పవన్‌
AP: మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం చెందడం బాధాకరమని అన్నారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోని ప్రజల రక్షణకు కర్ణాటకలో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని అన్నారు. అదే విధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని, విధానాలను పరిశీలించి ఏపీలో అమలు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్