చంద్రబాబు నాకు రాజకీయ జీవితం ఇచ్చారు: సీతక్క

52చూసినవారు
చంద్రబాబు నాకు రాజకీయ జీవితం ఇచ్చారు: సీతక్క
టీడీపీ చీఫ్ చంద్రబాబు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. ‘ఈ విద్యాసంస్థతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎంతో మంది నిరుపేద బిడ్డలకు చంద్రబాబు సహకారంతో ఉచిత విద్యను అందించాను.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నారా భువనేశ్వరి పాల్గొన్నారు. గతంలో మంత్రి సీతక్క టీడీపీలో పని చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్