కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం

84చూసినవారు
కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం
ఏపీలో పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్‌ 6 వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్