దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వేదికను పంచుకున్న చంద్రబాబు వారిని ఉద్దేశించి చమత్కారంగా మాట్లాడారు. ‘తెలంగాణ స్టేట్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. వాళ్లు రిచ్.. మేము పూర్’ అని సరదాగా వ్యాఖ్యానించారు.