ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8వ తేదీన విశాఖ రానున్నారు. రేపు సాయంత్రం 4.15 గంటలకు ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 4.45 గంటల నుంచి మోదీతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు చంద్రబాబు విజయవాడ బయల్దేరనున్నారు.