ఏపీ సీఎం చంద్రబాబు జన నాయకుడు కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. సమస్యలు పరిష్కరించి ఆన్‌లైన్‌లోనే పొందుపర్చేలా చర్యలు తీసుకోనున్నారు.